వైట్‌హౌస్‌లో ఉండటానికి నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా అయిష్టత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓవల్ ఆఫీసులో ట్రంప్-బైడెన్ భేటీకి మెలానియా హాజరుకాలేదు. ప్రస్తుతం అమెరికా తొలి మహిళగా ఉన్న జిల్ బైడెన్ ఇచ్చే టీ పార్టీకి సైతం ఆమె దూరంగా ఉన్నారు. దీంతో వైట్‌హౌస్‌లో ఉండేందుకు మెలానియా ఇష్టపడడం లేదని ప్రచారం జరుగుతోంది. న్యూయార్క్, ఫ్లోరిడాలోనే మెలానియా ఎక్కువ సమయం గడుపుతారని సమాచారం.