సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ (107*) సెంచరీతో చెలరేగాడు. తాజాగా దీనిపై తిలక్ స్పందించాడు. సెంచరీ కంటే మ్యాచ్ గెలవడం మరింత సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. దేశం కోసం ఆడాలని.. శతకం చేయాలనేది తన కల అని తెలిపాడు. ఈ క్రెడిట్ కెప్టెన్ సూర్యకే దక్కుతుందని అన్నాడు. అతడే తనకు మూడో స్థానంలో వచ్చే అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.