AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో సత్య నీరజ్ కుమార్నాయుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్తానం తన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎదుటివాళ్లను ఇబ్బందులకు గురిచేసేలా పోస్టులు పెడితే అరెస్టు చేయరా? అని ప్రశ్నించింది. పిటిషన్పై సాధారణ పద్ధతిలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అనంతరం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.