TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపైన జరిగిన దాడిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. అయితే ఈ దాడి BRS చేయించిందని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే BRS సైలెంట్ అవుతుందనుకుంటున్నారని.. కానీ అరెస్టులకు భయపడేవాళ్లం కాదన్నారు. ఫార్మా సిటీపై ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే అధికారులపైన ఆక్రోశం చూపించారని మండిపడ్డారు.