»Do You Know The Cost Of S Wedding In How Many Crores Per Day
sharwanand:వామ్మో.. శర్వానంద్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడా !
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరైన హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ఏ లో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్న రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
sharwanand:టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరైన హీరో శర్వానంద్(sharwanand) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ఏ(USA) లో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్న రక్షితా రెడ్డి(Rakshita Reddy)తో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యులు, పలువురు సినీ సెలబ్రెటీల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్(Engagement) వేడుక హైదరాబాదులో జరిగింది. ఇటీవల వీరికి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
రాజస్థాన్లోని జైపూర్(Jaipur)లో ఉన్న లీల ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. జూన్ 2, 3వ తేదీలలో గ్రాండ్ గా వీరి వివాహ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. శర్వానంద్ రక్షితా రెడ్డిల వివాహం జూన్ 3వ తేదీన జరుగుతోంది. ఈ వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఈ ప్యాలెస్ లో రోజుకు దాదాపుగా రూ .4కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు బంధువులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితం(Oke oka jeevitham) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లో బిజీగా ఉండడం వల్ల శర్వానంద్ వివాహం కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.