మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు పై మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. డీజీసీఏ నిబంధనల మేరకు ఎయిరిండియా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఘటనకు వేదికైన న్యూయార్క్-ఢిల్లీ విమానం పైలెట్ ఇంఛార్జి లైసెన్స్‌ను డీజీసీఏ మూడు నెలలపాటు రద్దు చేసింది. మరోవైపు మహిళపై మూత్రం పోసిన ప్రయాణికుడు శంకర్ మిశ్రాపై ఎయిరిండియా మరో నాలుగు నెలల ప్రయాణ నిషేధం విధించింది. గతంలో విధించిన 30 రోజుల ప్రయాణ నిషేధానికి ఇది అదనం.