జూ. ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమా రిలీజ్ రోజున కొంచెం మిశ్రమ స్పందన పొందినా, ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్‌లో సినిమా స్థానం దృఢంగా ఏర్పడుతోంది. పాన్ ఇండియా విడుదలలకు హిందీ వెర్షన్ పెర్ఫార్మన్స్ చాలా ముఖ్యం అవుతున్న తరుణంలో దేవర అక్కడ సత్తా చాటుతుంది. రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్స్ సినిమాను నిలబెడుతున్నాయి.
ఈ సినిమా తొలి రోజున 7.5 కోట్ల నెట్ వసూలు చేసి., రెండవ రోజున 9.5 కోట్లు, మూడవ రోజున 12.75 కోట్లతో విజయాన్ని కొనసాగించింది. ఈ విజయవంతమైన వీకెండ్ తర్వాత, సినిమా నేటి వరకు స్థిరంగా ఉన్న ఆదాయాన్ని కొనసాగిస్తోంది. ఐదవ రోజు వర్కింగ్ డే అయినా కూడా, “దేవర” 4.8 కోట్లను కలెక్ట్ చేసి, నాలుగవ రోజున కలెక్ట్ చేసిన 4.4 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టింది.
ఈ క్రమంలో, “దేవర” హిందీ బాక్సాఫీస్‌లో 100 కోట్ల నెట్‌ను దాటడానికి పరుగులు పెడుతుంది. ఈ సినిమా కంటెంట్, నటన మరియు ప్రేక్షకుల స్పందన అన్ని కలిపి, దీన్ని ఒక పెద్ద విజయంగా నిలబెట్టాయి
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అనిరుద్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మొత్తానికి “దేవర” భారతీయ సినీ పరిశ్రమలో మరో అద్భుత విజయంగా నిలిచింది. హిందీ లో 100 కోట్ల మార్క్ దాటితే సీక్వెల్ కి వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు