టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం, హిందీ సినీ పరిశ్రమలో సౌత్ ఇండియా చిత్రాలకు దీటుగా అద్భుతమైన ప్రదర్శనను నమోదు చేస్తోంది. హిందీ మార్కెట్లో సౌత్ సినిమా విడుదలలు కీలకంగా మారుతున్నాయి, ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలకు ఈ మార్కెట్ ఫైనల్ రెవెన్యులో ఎక్కువ భాగాన్ని తెచ్చిపెడుతుంది
దేవర నార్త్ ఇండియాలో ఫస్ట్ డేలో 7.5 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. రెండో రోజు, సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటూ 9.5 కోట్ల రూపాయలను సంపాదించింది. ఆదివారం, అంటే మూడో రోజు 12.75 కోట్ల రూపాయల కలెక్షన్లతో మైలురాయిని అధిగమించింది. మొత్తం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ 28.25 కోట్ల రూపాయలుగా నమోదైంది.
సోమవారం కలెక్షన్లు స్థిరంగా ఉంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం దేవర బాలీవుడ్లో 75 కోట్ల నెట్ దిశగా వెళ్తుంది. అంటే, ఇంతకు ముందు వచ్చిన “పుష్ప”, “కార్తికేయ 2”, “కాంతారా”, “సాహో” వంటి చిత్రాల జాబితాలో, ఎన్టీఆర్ దేవర మరో అద్భుతమైన హిట్ గా నిలుస్తుంది.
అయితే, సోమవారం 4.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే, ఇది ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగ లాంటి వార్తే. దేవర తెలుగు సినిమాలకు హిందీ పరిశ్రమలో కొత్త మార్గాలు చూపించినట్లు అనుకోవచ్చు, ఇది భవిష్యత్తులో మరిన్ని సౌత్ ఇండియన్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ ఆలోచన చేసేలా ఉపయోగపడుతుంది