»Delhi Capitals Star Player Behaves Inappropriately With A Woman Under The Influence Of Alcohol
IPL 2023: మద్యం మత్తులో మహిళతో IPL స్టార్ఆ టగాడి అనుచిత ప్రవర్తన..!
సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓ స్టార్ ఆటగాడు పార్టీలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేక కథనం ప్రచురించింది. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)పై గెలిచిన తర్వాత జరిగిన పార్టీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాడి పేరు ఇంకా బయటకు రాలేదు. ఓ నైట్పార్టీ(Night party)లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఆటగాళ్ల భద్రతకు సంబంధించి కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. వీటి ప్రకారం ఇకపై అతిథులు (guests) ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లడానికి అనుమతి లేదు.
అలాగే రాత్రి 10 గంటల తర్వాత ఆటగాళ్లు తమ గదులు దాటి బయటకు వెళ్లడానికి పర్మిషన్ లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను కలవాలంటే ఫోటో గుర్తింపుతో పాటు, IPL జట్టు అధికారి నుండి అధికారిక అనుమతి తప్పనిసరిగా పొందాలి. లేకపోతే హోటల్ (Hotel) లోని రెస్టారెంట్ (Restaurant) లేదా కాఫీ షాప్లో ఆటగాళ్లను కలవవచ్చని పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టోర్నీ 16వ ఎడిషన్ ఆసక్తికరంగా జరుగుతోంది. సగం మ్యాచ్లు పూర్తి కావడంతో ఇప్పుడిప్పుడే ప్లే ఆఫ్ బెర్తులపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. కాగా గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఈసారి పేలవంగా ఆడుతోంది. వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటే ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది.