పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని జమ్మి చెట్టుపై వాళ్లు దాచిన ఆయుధాలను తీసుకొని వచ్చేటప్పుడు దసరా రోజు వారికి మొదట పాలపిట్ట కనిపించిందట. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు గెలుపొందుతారు. అందుకే దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకుంటారు.