TG: అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్గా గుర్తించారు. ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి, యువతిగా నటిస్తూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.