వెన్నెముక, నడుము, పాదాలు బలం పెంచుకోవడానికి బాలాసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనంలో 3 నుంచి 5 నిమిషాలపాటు స్థిరంగా ఉండటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. నడుమును పైకి ఎత్తకుండా శరీరాన్ని ముందుకు వంచాలి. తలను నేలకు ఆనించి, చేతులను వెనక్కి చాపి పాదాలను అందుకోవాలి. ఈ భంగిమలో శ్వాసక్రియ నిధానంగా కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.