TG: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కోసం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో మాట్లాడామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2 లోపు జిల్లాలో ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌కు యూనివర్సిటీని కూడా తీసుకురాబోతున్నట్లు తెలిపారు.