»Congress Chief Rahul Gandhi Is Ready To Give Mla Ticket To Gaddars Son Surya Kiran
Gaddar: గద్దర్ కొడుక్కు ఆ పార్టీ నుంచి టిక్కెట్టు కన్ఫామ్?
బతుకంతా పోరాటం, అణగారిన ప్రజలకై నిత్యం ఆరాటం ఇదే ప్రజాగాయకుడు గద్దర్ ప్రస్థానం. ఆయన ఎమ్మెల్యే కావాలని కలగన్నాడు. కాలం వేరే కథ రాసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన కొడుక్కు జాతీయ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.
Congress chief Rahul Gandhi is ready to give MLA ticket to Gaddar's son Surya Kiran
Gaddar: పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలామా అన్న గద్దర్(Gaddar) అస్తిమించే సూర్యుడు ఉదయించినట్టు ఉద్యమ ప్రస్థానం ఎక్కడ వచ్చినా అక్కడ జన్మిస్తూనే ఉంటాడు. సాంస్కృతిక ఉద్యమ సారధి అయిన గద్దర్ ప్రస్థానం ఈనాటిది కాదు. రైతాంగా సాయుద పోరాటాన్ని కళ్లారా చూసి చితికిన హృదయంతో తెలంగాణ(Telangana)లో బహుజనుల ఆస్థిత్వం కోసం బ్యాంకు ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలి.. గన్నుపట్టి అడవుల్లో సవాసం చేసి మూడు దశాబ్దాల కాలం వీరోచిత పోరాటం జరిపి.. ప్రజల్లో చైతన్యం రావాలంటే ఉద్యమకారులు అడవుల్లో కాదు ప్రజల మధ్యలో ఉండాలని జనజీవనంలోకి వచ్చారు. ఆయన తనదైన పాట, మాటతో ఎందరో యువకులకు ప్రొద్భలాన్ని ఇచ్చాడు. గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరి ఓపెన్ హార్ట్ విజయవంతం అయిన తరువాత షుగర్, బీపీలు అదుపు తప్పి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవడంతో మరణించారు.
అయితే గద్దర్ చిరకాల స్పప్నం నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం అందరిలో బాధను మిగిల్చింది. బతుకంతా పోరాటం. ఏనాడు కడపు నిండ తినలేదు. కంటినిండ నిద్రలేదు అనే మాదిరిగా..75 ఏళ్ల వయసులో గోశిగొంగడి, కాలిగజ్జ గట్టి గర్చించిన గద్దర్ ఎమ్మెల్యే(MLA) అయి పీడిత తాడిత ప్రజల తరుఫున శాసనసభ(Assembly)లో తన గొంతును వినిపించాలనుకున్నాడు. అందుకనే అదే సంవత్సరం తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే పార్టీని స్థాపించి రాబోవు ఎన్నికల్లో పోటీ చెద్దామనుకున్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభ సాక్షిగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పారు. అంతలోనే అనంతలోకాలను వెళ్లిపోయారు.
అయితే ఈ సంవత్సరం గద్దర్ కొడుకు సూర్యకిరణ్(Surya Kiran)ను కాంగ్రెస్(Congress) తరుఫున ఎన్నికల బరిలో నిలబెట్టాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో మంతనాలు జరుపుతున్నారట. గద్దర్ సతీమణి విమల్ రావుకు పార్టీ అధినేత్రి సంతాప లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల దృష్ట్యా సూర్యకు టికెట్ రావడం ఖాయంగా భావిస్తున్నారు. అయితే ఆయన్ను ఎక్కడ నుంచి పోటీలో దించుతారు అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.