CM KCR Inaugurates 2BHK Dignity Housing Colony In Kollur
CM KCR: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఊరు/ పట్టణాల్లో డబుల్ బెడ్ రూమ్ కాలనీలు కటిస్తోంది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ కాలనీ నిర్మిస్తోంది. ఇదీ ఆసియాలో అది పెద్దదని.. కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ పేరుతో నిర్మించారు. ఈ రోజు ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను సీఎం కేసీఆర్ (CM KCR) అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్ (CM KCR) తిలకించారు.
ఇక్కడ 60 వేల మంది ఉండేలా 15,660 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పేదల కోసం అన్నీ సౌకర్యాలతో ఆదర్శ టౌన్ షిప్ నిర్మిస్తోంది. కార్పొరేట్ హంగులతో.. నాణ్యతలో రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.1489.29 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao), సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy), మల్లారెడ్డి (malla reddy), వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prashanth reddy), తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav), మేయర్ విజయలక్ష్మీ (vijaya laxmi) పాల్గొన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద 15,660 డబుల్ బెడ్ రూమ్‌ల గృహ సముదాయాన్ని కొల్లూరులో ప్రారంభించిన సీఎం కేసీఆర్.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాలనీలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇల్లు చిన్నగా ఉండేదని.. అందరికీ సరిపోయేలా నిర్మిస్తోంది. కొన్ని గ్రామాల్లో పంచాయతీల వద్ద స్థలం ఉండటం లేదు. అలాంటి చోట ఇళ్లు నిర్మించుకునే వారి కోసం రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది.