Bandi Sanjay:ఇప్పుడు భజరంగ్ దళ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భజరంగ్ దళ్‌ను నిషేధించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భజరంగ్ దళ్‌ను నిషేధిస్తే హిందువుల సత్తా చూపిస్తామన్నారు. ఓబీసీ సమ్మేళనంలో సంజయ్ (Sanjay) మాట్లాడారు.
తెలంగాణలో భజరంగ్ దళ్‌పై నిషేధం విధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని బండి సంజయ్ (Bandi Sanjay) చెప్పారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎక్కడ నిషేధానికి సంబంధించి ప్రకటన చేస్తుందోననే భయం బీఆర్ఎస్లో ఉందన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్ నిషేధం ప్రకటన చేయాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పారు.
బీసీలకు గొర్రెల, బర్రెలు ఇవ్వడం వెనక కుట్ర దాగుందని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బీసీ బంధు ఎందుకు ప్రకటించడం లేదని అడిగారు. త్వరలో హైదరాబాద్ వేదికగా లక్షల మందితో బీసీ శంఖారావ సభ నిర్వహిస్తామని తెలిపారు. రామ రాజ్యం కోసం 5 నెలల సమయం ఇవ్వాలని క్యాడర్‌కు బండి సంజయ్ (Bandi Sanjay) పిలుపునిచ్చారు.
1600 కోట్లతో సచివాలయం నిర్మించారు.. బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించడం లేదని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. దళితబంధులో 30 శాతం కమిషన్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని ఆరోపిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూశాయని చెప్పారు.
కేసీఆర్ క్యాబినెట్లో ముగ్గురు బీసీ మంత్రులు ఉన్నారని.. అతని ఫ్యామిలీకి మాత్రం నాలుగు మంత్రి పదవులా అని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. రిజర్వేషన్లు తగ్గించి బీసీల పొట్టను కేసీఆర్ ప్రభుత్వం కొట్టిందని మండిపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించింది కేసీఆర్ కాదా అన్నారు.