»Class X Student Dies Of Cardiac Arrest In Hyderabad On Birthday
Heart Attack : బర్త్ డే రోజే గుండెపోటుతో విద్యార్థి మృతి.. మృతదేహం వద్దే కేక్ కట్
హైదరాబాద్(Hyderabad)లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 16 ఏళ్ల విద్యార్థి గుండెపోటు(Heart Attack )తో మరణించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ విద్యార్థి(Student) చనిపోయిన రోజు పుట్టిన రోజు కావడంతో..
Heart Attack : హైదరాబాద్(Hyderabad)లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 16 ఏళ్ల విద్యార్థి గుండెపోటు(Heart Attack )తో మరణించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ విద్యార్థి(Student) చనిపోయిన రోజు పుట్టిన రోజు కావడంతో.. తన ఇంట్లో ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించాడు. కానీ అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో ఒక్కసారిగా కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో బాధలోనే తల్లిదండ్రులు(parents) తమ కుమారుడి బర్త్ డే(birthday) సందర్భంగా కేక్ కట్ చేసి మృతదేహానికి నివాళులర్పించారు.
ఆసిఫాబాద్(asifabad) డివిజన్లోని బాబాపూర్ గ్రామానికి చెందిన సచిన్(sachin) తన పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నాడు. తన పుట్టినరోజుకు ఒకరోజు ముందు షాపింగ్ కోసం ఆసిఫాబాద్ వెళ్లాడు. బజారులో ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కిందపడిపోయాడు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సచిన్ మరణించిన తరువాత, అతని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. చిన్నారి చివరి కోరికను తీర్చేందుకు కుటుంబసభ్యులు మృతదేహం దగ్గర కేక్ కట్ చేసి అతడిని కౌగిలించుకుని విలపించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
బాబాపూర్ గ్రామం మొత్తం సచిన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సచిన్ వారి తల్లిదండ్రులకు మూడో సంతానం. అతను 10వ తరగతి విద్యార్థి. విద్యార్థి చదువులో చాలా తెలివైనవాడని గ్రామస్తులు తెలిపారు. సచిన్ మృతదేహం దగ్గర అతని స్నేహితులు పుట్టినరోజు పాట పాడగా, స్థానిక గ్రామస్తులు అతని జ్ఞాపకార్థం కొవ్వొత్తి వెలిగించారు.