AP: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అవస్థలపై సీఎం చంద్రబాబు అధికారులతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సరఫరా సాధారణ స్థితికి చేరుకునే వరకు నిరంతరం పర్యవేక్షిచాలని ఆదేశించారు. నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని అధికారులు వివరించారు. సాధారణ స్థితికి చేరేవరకు నిరంతరం పర్యవేక్షణ జరగాలని సీఎం సూచించారు.