AP: మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలు, రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.