ఎన్ని మందులు వాడిన రక్తపోటు అదుపులోకి రాని వారికి బాక్స్ డ్రోస్టాట్ అనే కొత్త ఔషధం వచ్చింది. ఇది నియంత్రణలోకి రాని బీపీని సైతం సమర్థవంతంగా తగ్గిస్తున్నట్లు ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. ఈ ట్రయల్స్‌లో భాగంగా రోజూ ఒకసారి 1 మిల్లీగ్రామ్ లేదా 2 మిల్లీగ్రాముల బాక్స్ డ్రోస్టాట్ మాత్ర తీసుకున్న వారిలో 12 వారాల తర్వాత రక్తపోటు గణనీయంగా తగ్గింది.