కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటనలో అందరి దృష్టి ఆకర్షించిన ఒక అంశం BSNLకు భారీగా నిధులు ప్రకటించడం. టెలికాం రంగానికి 1.28 లక్షల విడుదల చేసిన కేంద్రం, అందులో సింహభాగం BSNL అప్గ్రేడ్, పునర్నిర్మాణానికి కేటాయించారు. ఇది ఎవరూ ఊహించని ఘట్టం.
ప్రైవేట్ ఆపరేటర్లు టారిఫ్ లు పెంచిన తరుణంలో వినియోగదారులు BSNLకు పోర్ట్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన నిధులతో త్వరలో BSNL 4జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి
BSNL, MTNL ఉద్యోగులకు కూడా బడ్జెట్ తీపి కబురు చెప్పినట్టే . BSNL మరియు MTNL ఉద్యోగులతో సహా టెలికాం డిపార్ట్మెంట్ ఉద్యోగుల పెన్షనరీ ప్రయోజనాల కోసం ₹17,510 కోట్ల రూపాయిలను కేటాయించింది
భారతీయ టెలికాం గేర్ తయారీని ప్రోత్సహించేందుకు, మదర్బోర్డులపై దిగుమతి టాక్స్ ను 5 శాతం పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తానికి బడ్జెట్ తరువాత BSNL భవిష్యత్తు మారబోతుందని టెలికాం రంగానికి, స్టాక్ మార్కెట్ కు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు