»Bjp Releases Poll Manifesto For Karnataka Assembly Elections
Karnataka Elections : రోజు పాలు, ఫ్రీ గ్యాస్, పదిలక్షల ఉద్యోగాలు.. ఓటర్లపై బీజేపీ వరాల జల్లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు కసి మీద ఉన్నాయి. ఆ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్బంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు అమలు చేయాల్సిన పనుల మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి
Karnataka Elections : కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక(Karnataka Elections)ల్లో గెలిచి జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు కసి మీద ఉన్నాయి. ఆ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్బంగా ఓటర్ల(Voters)ను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు అమలు చేయాల్సిన పనుల మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కన్నడీగుల కోసం బీజేపీ(BJP) తన మేనిఫెస్టో(manifesto)ను విడుదల చేసింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(uniform civil code) తీసుకురావడం బీజేపీ మేనిఫెస్టోలో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు బీపీఎల్(Bpl) కుటుంబాలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తామంది. బీజేపీ మేనిఫెస్టో ‘విజన్ డాక్యుమెంట్’ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు(సోమవారం) బెంగళూరులో విడుదల చేశారు. నడ్డా మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో ఏసీలో కూర్చుని తయారు చేయలేదని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సందర్శించి లక్షలాది మంది ప్రజల సూచనల మేరకు రూపొందించామన్నారు.
బీజేపీ మేనిఫెస్టో(manifesto)లోని ప్రధాన హామీలు పరిశీలిస్తే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతి రోజూ అర లీటరు నందిని పాలు ఉచితంగా అందజేస్తామని బీజేపీ పేర్కొంది. దాంతో పాటు పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణధాన్యాలతో నెలవారీ రేషన్(Ration) అని ప్రకటించింది. అంతే కాకుండా వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం (ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున)గా ఇస్తామంది. మ్యాను ఫాక్చరింగ్ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు బీజేపీ హామీ ఇచ్చింది. కర్ణాటక(Karnataka) ఉమ్మడి పౌరస్పృతి అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు, నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు, వృద్ధులకు ఉచితంగా ఏడాదికోసారి హెల్త్ చెకప్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది.
ಪ್ರಜೆಗಳ ಸಲಹೆ, ಪ್ರಜೆಗಳ ಪ್ರಣಾಳಿಕೆ, ಪ್ರಜೆಗಳ ಸರ್ಕಾರ.
ಅನ್ನ, ಅಭಯ, ಅಕ್ಷರ, ಆರೋಗ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಆದಾಯದ ಭರವಸೆಯ ಬಿಜೆಪಿ ಪ್ರಜಾ ಪ್ರಣಾಳಿಕೆ 2023 ಇಂದು ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @JPNadda ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ರಾಜ್ಯ ನಾಯಕರ ಉಪಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿಡುಗಡೆಗೊಂಡಿತು.
మైసూరులోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) పేరు పెడతామంది. కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీ ఏర్పాటు, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను ప్రకటించింది. రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి మైక్రో కోల్డ్ స్టోరేజీ(Micro Cold Storage) సదుపాయాల కల్పన, రూ.1500 కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టనుంది. ప్రముఖులతో కలిసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విశ్వేశ్వరయ్య విద్యా యోజన, ప్రతిభావంతులైన యువ నిపుణుల కోసం సమన్వయ పథకం ద్వారా నైపుణ్యాల కల్పన చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకునే యువతకు ఉచితంగా కోచింగ్(Free Coaching) సదుపాయం కల్పించనుంది. బీఎంటీఎస్ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, 1000 స్టార్టప్ లకు మద్దతు, మిషన్ స్వాస్థ్య కర్ణాటక ద్వారా రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పన, మున్సిపల్ కార్పొరేషన్ లలోని ప్రతి వార్డులో రోగనిర్ధారణ సౌకర్యాలతో ‘నమ్మ క్లినిక్’, బెంగళూరు శివారులో ఈవీ సిటీ నిర్మాణం తదితరాలు బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.