అనేక నాటకీయ పరిణామాల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు(bcci president) మారాడు. ఆ పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీని పక్కన పెట్టి… ఆ బాధ్యతలను టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కి అందించారు. కాగా.. బీసీసీఐ నూతన అధ్యక్షునిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్ని(roger binny) నేడు ఎన్నికయ్యారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన్ని సభ్యులంతా కలిసి ఎన్నుకున్నారు.
బిన్నీతో పాటు ఏజీఎం నూతన కార్యవర్గాన్ని కూడా సభ్యులు ఎన్నుకున్నారు. బీసీసీఐ వార్షిక సాదారణ సమావేశాన్ని ముంబైలోని తాజ్ హోటల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో 30కి పైగా బోర్డు అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి.
2022 సెప్టెంబర్ తో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ(sourav ganguly) పదవీ కాలం ముగిసింది. దీంతో పాటు కార్యవర్గం పదవీ కాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో నూతన కార్యవర్గాన్ని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఎన్నికున్నారు.
ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా అరుణ్ ధుమాల్ వ్యవహరించనున్నారు. అంతకు ముందు ఆయన బోర్డు కోశాధికారిగా వ్యవహరించారు. బీసీసీఐ నూతన కోశాధికారిగా ముంబై క్రికెట్ సంఘం ప్రతినిధి అశీష్ షెలార్ ను ఎన్నుకున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ సైకియాలను ఎంపిక చేశారు. మరోవైపు బీసీసీఐ సెక్రటరీగా జైషా కొనసాగనున్నారు.