TG: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళలతో ఈ బడా గణేశ్ గంగమ్మ ఒడిని చేరేందుకు కదులుతున్నాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏకదంతుడి చుట్టూ రోప్ ఏర్పాటు చేశారు. ఈ 69 అడుగుల శ్రీ విశ్వశాంతి గణనాథుడి శోభాయాత్రను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా నెక్లెస్ రోడ్డులోని క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నారు.