ముంబైలో ఉగ్రదాడులు జరగనున్నట్లు ట్రాఫిక్ పోలీసులకు ఓ వ్యక్తి మెయిల్ పంపడం కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన అశ్విని కుమార్‌గా గుర్తించారు. గతంలో ఓ వివాదంలో తనపై స్నేహితుడు ఫిరోజ్ కేసు పెట్టగా.. అశ్విని జైలు శిక్ష అనుభవించాడు. దానికి ప్రతీకారంగా ఫిరోజ్‌ను ఉగ్రకేసులో ఇరికించాలని అతడి పేరుతో మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు.