AP: మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో 15 నెలల తర్వాత తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో 672 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా ఈ భద్రతను పర్యవేక్షించారు. పెద్దారెడ్డి రాక సందర్భంగా కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి ఆయనను స్వాగతించారు. 15 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్లటం ఆనందంగా ఉందని పెద్దారెడ్డి తెలిపారు.