వచ్చే ఏడాది జీ20 సదస్సును ఫ్లోరిడాలోని తన నేషనల్ డొరాల్ గోల్ఫ్ క్లబ్లో నిర్వహిస్తానని US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ సదస్సును అక్కడే పెట్టాలని జీ20 నిర్వాహకులతో పాటు అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో జరిగే జీ20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరవుతున్నారు. ఆయనకు బదులుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను పంపుతున్నట్లు ట్రంప్ తెలిపారు.