TG: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు రాష్ట్ర పోలీసులు సహకరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. నిన్న పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి అమిత్ షాతో భేటీ అయిన CM రేవంత్.. మావోయిస్టుల లొంగుబాట్లపై నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ పూర్తయ్యే వరకు పోలీసులు ఇలాగే సహకరించాలని, మిగిలిన మావోయిస్టులూ లొంగిపోయేలా చూడాలని అమిత్ షా సూచించారు.