AP: వైసీపీ సీనియర్ నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇతర సీనియర్ నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.