GNTR: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దన్నారు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇదని అన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.