KDP: వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల తనపై ఇద్దరు మహిళలు దాడి చేశారని, దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై తొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.