అన్నమయ్య: ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు నుంచి బుడ్డాయిపల్లి రోడ్డులో మోటర్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లు చోరీ అవుతున్నాయి. ఇందులో దొంగలకు లాభం కలిగిస్తే, తమకు మాత్రం వేల రూపాయల నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.