GNTR: మండల విద్యాశాఖ అధికారి ఎస్ఎంఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్‌లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.