కోనసీమ: కాపవరంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీల్లో ఆలమూరు మండలం గుమ్మిలేరు రైతు కోరా వీరభద్రరావు ఎడ్ల జతలు సత్తా చాటి బహుమతులను కైవసం చేసుకున్నాయి. సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో పోటీలను నిర్వహించగా జూనియర్స్‌లో ప్రథమ స్థానాలు కైవసం చేసుకోగా.. సీనియర్స్ విభాగంలో తృతీయ స్థానం బహుమతులను సాధించారు.