KRNL: హోలగుంద మండలం చిన్నహ్యట గ్రామంలో బసవ నాగేంద్ర తండ్రి జ్ఞాపకార్థం సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్సై నరసింహులు చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తండ్రి జ్ఞాపకార్థంతో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉండటం అభినందనీయమని అన్నారు.