KRNL: రాష్ట్రంలో రజకులకు 200యూనిట్ల ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. గురుశేఖర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులో ఏర్పాటు చేసిన కల్లూరు, కర్నూలు మండల కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజక కార్పొరేషన్ ద్వారా రుణాలు, కొత్త ధోబి ఘాట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.