AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీ గదబపాలెం, చంద్రయ్యపాలెంలోని ఆదివాసీ గిరిజనులకు సాగు హక్కు కల్పించాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. గిరిజన సంఘం నాయకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి సాగులో ఉన్న ఆదివాసీ గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు.