ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ అన్నారు. క్రిస్ట్ చర్చిపై దాడి, ముంబయి ఉగ్రదాడుల విషయంలో మా వైఖరి ఒకటేనని వెల్లడించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం కట్టడికి సంబంధించిన విషయాల్లో న్యూజిలాండ్తో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఆ దేశంలో భారత వ్యతిరేక కార్యకలాపాల పెరుగుదల గురించి ఆందోళన వ్యక్తం చేశామని మోదీ పేర్కొన్నారు.