రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని ఢిల్లీ ఎయిర్పోర్టు ఆక్షేపించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై కోర్టులో దావా వేసింది. ఘజియాబాద్ విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతిస్తే ఢిల్లీ విమానాశ్రయం నష్టపోతుందని ఆరోపించింది. ఈ మేరకు మార్చి 10న దాఖలు చేసిన దావాలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.