NLR: పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కందుకూరు పెన్షనర్ల గౌరవాధ్యక్షుడు రావులకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం కందుకూరు తహశీల్దార్ లావణ్యకు వినతిపత్రం ఇచ్చారు. పెన్షనర్ల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు PRC, IRలను వెంటనే ప్రకటించాలని,పెండింగ్లో ఉన్న DAలను చెల్లించాలని అన్నారు.