W.G: పెంటపాడు మండల పరిషత్ కార్యాలయాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. ఎంపీడీవో ఇచ్చిన వివరాలపై చైర్పర్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు.