సత్యసాయి: గోరంట్ల మండలం మలసముద్రంలో సోమవారం నూతన బోరు వేశారు. గ్రామ ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయాన్ని గ్రామస్థులు హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథి దృష్టికి తీసుకెళ్ళారు. ఎంపీ ఆదేశాలతో మలసముద్రం పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో సోమవారం నూతన బోరు వేశారు. త్రాగునీటి సమస్య పరిష్కరించినందుకు గ్రామస్థులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.