SRPT: కోదాడ పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ శివశంకర్ తెలిపారు. మంగళవారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో సుమారు 100 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.