కృష్ణా: పెడనలో జనవరి 3వ తేదీన హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు హిందూ ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ విజయనంద గిరి స్వామీజీ హాజరవుతారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను పెడన హిందూ సమ్మేళనం ఆహ్వాన కమిటీ సభ్యలు మంగళవారం శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ఆవిష్కరించారు.