W.G: ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది. ఇవాళ అందజేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ముందుగానే నిధులను విడుదల చేసింది. పెన్షన్ దారులకు నేడు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇవాళ తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారు.