TG: అబద్ధాల పునాదుల మీద తాము ప్రభుత్వాన్ని నడపలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడిందన్నారు. దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ అప్పులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఒక్క ఇసుక విక్రయంలోనే రోజువారీ ఆదాయం రూ.3 కోట్లు పెరిగిందన్నారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు.