ఏలూరు మండలం మల్కాపురంలో సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా సాగునీరు అందక ఎండిన వరి చేలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ.. రైతులు ఎవరు అధైర్య పడకండి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం తూములు, కాలువలు మరమ్మత్తులు చేపట్టక పోవడమే దీనికి కారణమన్నారు.