GNTR: తెనాలిలో అస్విత్ ఖేలో తైక్వాండో ఇండియా సిటీ ఉమెన్స్ లీగ్ మ్యాచ్ ఆదివారం జరిగింది. చెంచుపేట ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం వద్ద జరిగిన ఈ పోటీలకు తెనాలి అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి లక్ష్మీపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీల్లో 159 మంది విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలను అందజేశారు. తైక్వాండో నేర్చుకోవడం వల్ల శారీరక సౌష్టవం కలుగుతుందన్నారు.