PPM: ఈ నెల 19న విజయవాడలో జరిగే అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రను జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు అన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ ఆర్థిక మోసాలకు పాల్పడి పది సంవత్సరాలపైబడి గడిచిందని, గత తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కంపెనీ ఆస్తులు ఎటాచ్మెంట్ చేసినప్పటికీ బాధితులకు డిపాజిట్లు చెల్లింపు చేయడంలో విఫలమయ్యిందన్నారు.