TG: ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రైతులు సహకరించాలని, భూములిచ్చే వారు చరిత్రలో గొప్పగా నిలిచిపోతారని సీఎం రేవంత్ అన్నారు. రైతుల్లో అభద్రతాభావం లేకుండా, మానవత్వంతో భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. భూములిచ్చిన వారు వేరే చోట భూమి కొనుక్కునేలా పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ రెండేళ్లు సహకరిస్తే అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.